శ్రీ రాజేశ్వర స్వామి (తేతలి) Sri Rajeswara Swamy (Thetali)
శ్రీ రాజేశ్వర స్వామి,ఈ ఆలయం తణుకు పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ ఆలయ విశిష్టత ఎంతో గొప్పగా ఉన్నది ఈ ఆలయం గురించి చాలామంది చెప్పగా నేను కూడా వెళ్లి చూసి తరించాలని చెప్పి వెళ్లాను అందరూ చెప్పినట్టుగానే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీ రాజేశ్వర స్వామి వారి దర్శన భాగ్యం జరిగింది ఈ రోజు ఈ ఆలయం యొక్క విశేషాలు తెలుసుకుందాం. తేతలిలోని శ్రీ రాజేశ్వర స్వామి వారి పురాతన దేవాలయములు ప్రకృతి అందాలను దర్శించుకోవడం ఎంతో నయనానందకరం.
తేతలి నామము ప్రత్యేకత
ఈ ఆలయం, తేతలి గ్రామంలో ఉన్నది జాతీయ రహదారికి వైపు తణుకు పట్టణానికి వెళుతూ ఉండగా ఈ తేతలి గ్రామాన్ని మనం చూడవచ్చు ముందుగా మనం తేతలి అనగా ఏమిటో తెలుసుకుందాం అలాగే ఈ పేరు ఎందుకు వచ్చింది ఈ గ్రామానికి తెలుసుకుందాం ఈ గ్రామం పేరు మొదట్లో "తోతెలి'. ఈ గ్రామంలోనే నన్నయ మహాకవి తొలిసారిగా తెలుగులో భారత రచన ప్రారంభించను. ఇది రాజరాజ నరేంద్రుని కోరిక (11వ శతాబ్దం). ఆయన ప్రస్థానంలోనే ఈ గ్రామం పేరు తో తేలి గా వెలుగునిది. "తో" అనగా తొలిసారిగా అని 'తే" అనగా తెలుగు అని "లీ"అనగా లిపిలో అని అర్థము ఉన్నది.అనగా తొలిసారిగా తెలుగు లిపిలో భారత రచన చేసినందున ఈ గ్రామమునకు "తోతెలి" అని పేరు వచ్చినది. ఇది కాలక్రమేనా "తేతలి" గా మారింది
స్వామి వారి విశిష్టత
ఈ ఆలయంలో శివలింగము" బ్రహ్మ సూత్రంతో" స్వయంభుగా వెలసినది. రాజరాజ నరేంద్రుని కాలంలో అది దట్టమైన అటవీ ప్రాంతము ఆయన ఒకరోజు వేట నిమిత్తము ఆ ప్రదేశమునకు వెళుతూ ఉండగా ఒక కృష్ణ సర్పము వారిని అడ్డగించెను. అక్కడ నుంచి అశ్వము ముందుకు వెళ్లకపోవడం చూసి ఆ రాజరాజ నరేంద్రుడు వెనుతిరిగి తన నివాసమునకు వెళ్ళ్ళను. ఆరోజు స్వప్నములో ఆదిశేషుడు కనిపించి నువ్వు ఆగిన ప్రదేశంలో శివలింగము ఉన్నది దాన్ని బయటకు తీసి ఆలయ నిర్మాణం చేయమని ఆజ్ఞాపించెను.వెంటనే రాజరాజ నరేంద్రుడు ఆ మహిమాన్వితమైన ఆ శివలింగం పైకి తీసి ఆలయ నిర్మాణం చేసి శివలింగమును ప్రతిష్ట చేశారు. రాజరాజ నరేంద్రుడు ప్రతిష్టించిన శివలింగము కనుక ఈ శివాలయమునకు "శ్రీ రాజేశ్వరుడు" అని నామము కలదు. ఈ శివలింగముపై బ్రహ్మసూత్రము స్వయంభుగా కలిగినందువల్ల ఇది ఎంతో మహిమాన్వితమైన శివలింగముగా భక్తుల నీరాజనాలు స్వీకరిస్తుంది. శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు తన ప్రవచనాలలో ఈ ఆలయం యొక్క విశిష్టతను చెప్పటం జరిగింది వారి మాటలలో "ఈ ఆలయంలో అర్చనకు సంబంధించినవి ఏది చేసినను కోటి సార్లు చేసిన విధంగా ఫలితాన్నిచ్చులు" ఎందుకు అనగా ఇది స్వయంభులింగమైన బ్రహ్మ సూత్రం చిహ్నముతో ఉండటమే. ఇక్కడ పార్వతి దేవి పరమేశ్వరుడు కొలువైన గొప్ప క్షేత్రం.రెండు నందు వాహనములు
ఈ శివాలయంలో శివునికి ఎదురుగా రెండు లందరూ ఒకదాని వెనుక ఇంకొక దానిని మనం చూచుట జరుగుతుంది. పూర్వకాలంలో శివలింగమునకు ఎదురుగా ఒక నందీశ్వరుని ప్రతిష్టించారు. పూర్వపు రోజులలో ఎలాంటి వైద్య సదుపాయాలు గ్రామాలలో ఉండేవి కావు గర్భవతులు వారి ప్రసవ సమయం లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు వారి కుటుంబ సభ్యులు ఈ దేవాలయమునకు వెళ్లి అర్చక స్వాములకు విషయం తెలుపుగా వారు నంది విగ్రహమునకు దీపారాధన చేసి, కొబ్బరికాయ కొట్టి శివునికి ఎదురుగా పశ్చిమ ముఖముగా ఉన్నా నందీశ్వరుని తూర్పు ముఖముగా గ్రామం వైపునకు తిప్పేవారు. కొద్దిసేపటికే ప్రసవ వేదనలు పడుతున్న ఆ స్త్రీకి సుఖ ప్రసవం అయ్యి తల్లి బిడ్డ క్షేమంగా ఉండేవారు. వారు తిరిగి వచ్చి అర్చక స్వాములకు జరిగిన విషయం చెప్పేవారు వెంటనే అర్చన స్వాములు నందీశ్వరుని యధాస్థానంలో తిప్పేవారు. ఇలాగే కొన్నాళ్లు జరిగిన తర్వాత ఇంకొక నందీశ్వరుని ప్రతిష్టించడం జరిగినది.. దీనికి గల కారణం ఏమిటంటే శివునికి నందీశ్వరునికి మధ్యలో ఎవరూ నడవకూడదు అని కూడా అంటారు. ఈ సమయంలో శివునికి నందీశ్వరుని శ్వాస తగులుటకు ఆటంకం అయ్యేది. అందువలన ఇంకొక నందీశ్వరుని ప్రతిష్టించడం జరిగినది.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం
ఈ ఆలయము, ఆ రాజరాజే నరేంద్రుడు ప్రతిష్టించుటకు గల కారణము కృష్ణ సర్పము, కనుక ఈ ఆలయానికి కృష్ణ సర్పము గుర్తుగా "శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారి ఆలయమును ప్రతిష్టించడం జరిగినది. వివాహం జరగటానికి ,అలాగే కుజదోష నివారణకు, సంతానం కలగటానికి ,ఈ స్వామివారికి విశేషమైన పూజలు చేయడం జరుగుతుంది.
అలుగోత్సవము
ఈ దేవాలయంలో మరొక విశిష్టత శివరాత్రి ఉత్సవములు ఐదు రోజులు చాలా ఘనంగా జరుగుతాయి.మొదటి రోజున కళ్యాణం అయిన తరువాత రెండో రోజు ఈ "అలగోత్సవము" గొప్ప వేడుకగా జరుపుతారు. దక్షయజ్ఞమునందు పార్వతీదేవిని దక్షుడు అవమానించినందున శివాజ్ఞతో వీరభద్రుడు ఆ దక్షిణ్ణి సంహరించినందున ఆ పరమేశ్వరుడు ఆనంద భరితుడై ఉండెను, ఆనాటి వీరభద్రుని విజయ చిహ్నంగా ఈ ఆలయంలో కళ్యాణమైనా మధ్యాహ్నం సమయంలో అలుగులను ( బాణములు,సూలములు, కత్తులు) శరీరమంతా గుచ్చుకొని వివిధ రకమైన వేషధాలు ధరించి ఊరేగింపు చేతులు. ఈ వేడుకలో ఊరేగించరు. దీని ద్వారా వీరభద్రుడు దక్షుని సహోరించుటను శివునికి గుర్తు చేసి ఆ పరమేశ్వరుని ఆనందపరుచుటకు ఈ అలుగోత్సవము ప్రధాన ఉద్దేశం.
ఇలాగా మరెన్నో విశిష్టతను కలిగిన ఈ అపురూపమైన దేవాలయములను నేను దర్శించి ఉన్నాను. ఎడమవైపున రామాలయం ఉన్నది అక్కడ కూడా స్వామివారిని దర్శించి రావడం జరిగింది. శ్రీ రాజేశ్వర స్వామి వారి దేవాలయమునకు ప్రాంగణంలో ఒక గొప్ప రావి చెట్టు కలదు దానికి ముందుగా పెద్ద నందీశ్వరుడు విగ్రహం కూడా కలదు.ఆలయమునకు చేరుకునే మార్గాలు
తణుకు పట్టణము నుంచి బస్సు సౌకర్యం కలదు.



.jpeg)
0 Comments