Ticker

6/recent/ticker-posts

ద్వారక తిరుమల క్షేత్రము - చరిత్ర, About Dwarakatirumala

 

ద్వారక తిరుమల క్షేత్రము - చరిత్ర


ద్వారకాతిరుక్షేత్రం మన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకి సమీపంలో ఉన్న మహా క్షేత్రం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.ఇది విజయవాడ నగరానికి 98 కి.మీ. దూరంలోను, రాజమండ్రి నగరానికి 75 కి.మీ. దూరంలోను ఉన్నది. ద్వారకా తిరుమల క్షేత్రం భారతదేశంలో అత్యంత  ఆధ్యాత్మిక క్షేత్రముగా చెప్పబడుతుంది.

ద్వారకాతిరుమల ఎన్ని కిలోమీటర్లు చిన్న తిరుపతి రూట్ మ్యాప్
ఇక్కడ శ్రీ వేంకటేశ్వర స్వామి సాక్షాత్తు స్వయంభుగా వెలసిన క్షేత్రం ఇది శేషాద్రి కొండపై కలియుగ శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుతీరిన  స్థలము. చీమల పుట్ట నుండి  స్వామి వారిని బయటకు తీసి ఆ ద్వారకాముని శ్రీ వేంకటేశ్వర స్వామి కృపకు పాత్రులు అయ్యారు కావున ఈ క్షేత్రమునకు ద్వారకాతిరుమల పేరు  వచ్చినది. 



దశరథ మహారాజు కాలం నాటిది

 ఈ గొప్ప క్షేత్రమునకు రఘువంశం లోని శ్రీ దశరథ మహారాజు కాలం నాటిదని భావిస్తారు అలాగే శ్రీరాముడు ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నారు అని కూడా  స్థలపురాణంలో ఉన్నది.  ఇక్కడ ద్వారక మహర్షి తపస్సు చేసి స్వామివారి పాద సేవలో కోరాడు స్వామి వారు అనుగ్రహించి అందుచేతన  పాదములు పూజించే భాగ్యం అతని దక్కింది. అలాగే శ్రీ రామానుజాచార్యులు ఈ మహా క్షేత్రాన్ని దర్శించి అందరికీ స్వామివారి పాదపూజ చేసుకునే మహద్భాగ్యాన్ని కలిగించారని భక్తుల ప్రగాఢ నమ్మకం




చిన్న తిరుపతిగా ప్రసిద్ధి 

 ఇక్కడ మరో గొప్ప విషయం ఏమిటంటే మనం స్వామివారి దగ్గర ద్విమూర్తులు దర్శించుకోవచ్చు.  వైఖానసగమం ప్రకారం ఒక నిలువెత్తు విగ్రహాన్ని స్వామివారి స్వయంభు విగ్రహానికి వెనుక వైపు ప్రతిష్టించారని అంటారు. అనగా సగభాగం కనిపించే విగ్రహం స్వయంభుగాను వెనుక వైపు కనిపించే విగ్రహం ప్రతిష్టించినది గారు ఇక్కడ చెబుతారు.  అలాగే స్వయంభుగా వెలిసిన స్వామిని దర్శించే వాళ్ళ మోక్షం సిద్ధిస్తుందని అలాగే ప్రతిష్టించిన విగ్రహాలను దర్శించడం వల్ల  ధర్మార్థ కామ పురుషోర్ధములు సమకూరుతాయని  భక్తుల ప్రగాఢ విశ్వాసం.  ద్వారకా మహర్షి ఇక్కడ ఉత్తరాభిమఖంగా తపస్సు చేయటం వలన  స్వామిదక్షిణముఖంగా  ప్రత్యక్షమైనందున ఇక్కడ స్వామి దక్షిణముఖంగా ఉండటం మరొక విశేషం.




మ్రొక్కిన  మ్రొక్కులు  

ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఎవరైనా భక్తులు పెద్ద తిరుపతిలో  మ్రొక్కులు ఉన్నట్లయితే వాటిని మన ద్వారకాతిరుమల క్షేత్రం వాటిని తీర్చుకోవచ్చు,  కానీ ద్వారకా తిరుమలలో ఏమైనా  మ్రొక్కులు మ్రొక్కుకుంటే వాటిని మటుకు ద్వారకాతిరుమల క్షేత్రంలోని ఆ మొక్కలను తీర్చాల్సి ఉంటుంది అని స్థానిక భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం.


ఒకే విమాన శిఖరం క్రింద

ఒకే విమాన శిఖరము క్రింద ద్విమూర్తులు విగ్రహములు ఉండటము ఇక్కడి విశేషము. ఒక విగ్రహము సంపూర్ణమైనది.  మరొకటి స్వామియొక్క పై భాగము మాత్రమే  కనిపించే అర్ధ విగ్రహము.  అందువలన  ద్వారకాతిరుమలక్షేత్రంకు చిన్న తిరుపతి అన్న మారు పేరు వ్యవహారంలో వుంది. ద్వారకుడు అనే బ్రాహ్మణుడు ఎల్లప్పుడు తిరుపతి వెళ్లి ప్రతిఏటా వేంకటేశ్వరస్వామిని  దర్శించుకునేవారు.


మరో వాదన 

ఆయనకు  పెద్ద వయసు వచ్చాక ఆలయానికి అంతదూరం రావడం కష్టం కావడంతో స్వామివారే ఇక్కడ వెలిశారని, ఆ ద్వారకుని పేరటనే ద్వారకా తిరుమలగా పేరు వచ్చిందని భావిస్తారు.  ఇక్కడ  వృక్షములుకొట్టి కట్టెలు అమ్ముకోవడం-దారుకము వృత్తిగా కలవారు , దారువులు( వృక్షములు) ఎక్కువగా వుండడంతో, మెట్ట ప్రాంతానికి ద్వారం  మార్గం వంటిది కావడం వంటి కారణాలతో  ఈ క్షేత్రం ద్వారకా తిరుమల అయిందని మరొక వాదం వుంది. తిరుమలను  తిరుపతి ని పెద్ద తిరుపతిగా వ్యవహరిస్తూ ఆ క్రమంలోనే దీనిని చిన్న తిరుపతిగా వ్యవహరిస్తూంటారు.


ప్రతి ఏటా రెండు కళ్యానోత్సవములు

ఈ దేవాలయం యొక్క సంప్రదాయము ప్రకారము  ప్రతి సంవత్సరం రెండు కళ్యానోత్సవములు  జరుగుతాయి.  ఒకటి వైశాఖ మాసములో మరియు  రెండవది ఆశ్వయిజ మాసములలో జరుపుతారు. ఇందుకు కారణం-  స్వయంభు మూర్తి వైశాఖమాసంలో దర్శనమిచ్చారనీ, సంపూర్ణ  ప్రతిష్టించిన విగ్రహాన్ని ఆశ్వయుజంలో ప్రతిష్ఠించారనీ చెబుతారు. ఈ రెండు విగ్రహాలకు అనుగుణంగా రెండు కళ్యానోత్సవాలను అత్యంత వైభవోపేతంగా ఈ  ద్వారకా తిరుమల క్షేత్రం(చిన్న తిరుపతి)లో నిర్వహిస్తారు.




స్వామివారి పాదాలు

ఆలయ ప్రవేశంలో కళ్యాణ మంటపం ఉంది. మంటపం అనంతరం మెట్లు ఎక్కే ప్రాంభంభంలో ( మొదటి మెట్టు వద్ద) స్వామివారి పాదాలను  మనం చూడవచ్చు. శ్రీపాదాలకు నమస్కరించి భక్తులు పైకెక్కుతారు. పైకి వెళ్లే మెట్ల మార్గంలో రెండు  వైపుల దశావతారముల విగ్రహములు ప్రతిష్ఠింపబడినవి. మెట్లకు ఆండాళ్ సదనం ఉన్నాయి. పడమటివైపు  శ్రీపద్మావతి సదనం, దేవాలయం కార్యాలయం,ఉన్నాయి..


శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు

గర్భగుడిలో  శ్రీ వేంకటేశ్వర స్వామి “స్వయంభూ వేంకటేశ్వర స్వామి”, మరియు “ప్రతిష్ఠింపబడిన వేంకటేశ్వరస్వామి” ప్రతిమలు కన్నులపండువుగా దర్శనమిస్తాయి. ఆ ప్రక్కనే కుడివైపు అర్ధ మంటపంలో తూర్పు ముఖంగా మంగతాయారు  అమ్మవారు,  మరియు అండాళ్ (శ్రీదేవి, భూదేవి) అమ్మవార్లు కొలువై ఉన్నారు. శుక్రవారం అమ్మవార్లకు విశేష కుంకుమార్చన చేస్తారు. ఈ కుంకుమార్చనకు స్థానికులే కాకుండా  రెండు తెలుగు రాష్ట్రంలో నుండి అంతేకాక దేశంలోని వివిధ ప్రాంతాల నుండి కూడా వస్తూ ఉంటారు.


నాలుగు గాలి గోపురాలు 

ముఖ్య ఆలయమునకు తూర్పువైపున యాగశాల, వాహనశాల, మహానివేదనశాల, మరియు పడమటినైపున తిరువంటపడి పరికరాలశాల ఉన్నాయి. నాలుగు దిక్కులా నాలుగు గాలి గోపురాలున్నాయి. వీటిలో పెద్దదైన దక్షిణ దిక్కు గాలిగోపురం ఐదు అంతస్తులది. గోపురములో చక్కని దక్షిణ భారత శిల్పశైలిని దర్శించవచ్చు.  ఆలయప్రాకారము చుట్టూ పన్నెండుగురు ఆళ్వారుల విగ్రహములు ప్రతిష్ఠింపబడ్డాయి. 

Dwaraka Tirumala,ద్వారక తిరుమల క్షేత్రము చరిత్ర, About Dwarakatirumala


పుష్కరిణి

గ్రామం పశ్చిమాన స్వామివారి పుష్కరిణి ఉంది. దీనిని సుదర్శన పుష్కరిణి గా, మరియు నరసింహ సాగరమని, అలాగే కుమార తీర్ధమనీ కూడ అంటారు. ఇక్కడ చక్ర తీర్ధము, రామ తీర్ధము అనే రెండు స్నానఘట్టాలున్నాయి. ఇక్కడి  శిలలపై సుదర్శన (చక్రం) ఆకృతి ఉన్నందున ఆ పేరు వచ్చింది. ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి (క్షీరాబ్ధి ద్వాదశి)  పర్వదినం రోజున తెప్పోత్సవం జరుపుతారు.  ఈ పుష్కరిని సమీపంలోనే శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం అలాగే ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా దర్శించవచ్చు.ఈ ఉత్సవాల సమయంలో ఇక్కడ  స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామంలో నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి కృపకు పాత్రులు అవుతారు..

ప్రస్తుతం ఉన్న ద్వారకా తిరుమల ఆలయాన్ని మైలవరం జమీందారులు కట్టించారట. విమానమండపము, గోపురము, మరియు ప్రాకారాలను శ్రీ అప్పారావు అనే వ్యక్తిబంగారు ఆభరణాలు, వెండి వాహనాలను శ్రీరాణీ చిన్నమ్మరావు స్వామివారికి సమర్పించినట్లు ఇక్కడ చెప్తారు. 


నిత్య కల్యాణం

నిత్య అర్జిత కళ్యాణం ప్రతిరోజూ శ్రీ వెంకటేశ్వరుడికి చేస్తారు. నిత్య కళ్యాణం టికెట్ కళ్యాణ మండపం వద్ద లభిస్తాయి. ఉగాది పర్వదినమున ఉగాది మండపము నందు పంచాంగ శ్రవణం జరుగును

సందర్శించే యాత్రికులకు 
ఇక్కడ దేవస్థానం వారు భక్తుల సౌకర్యార్థం అనేక రకమైన కాటేజీలు మరియు డార్మింటరీలు కల్పించడం అయినది.

ద్వారకాతిరుమల చేరుకోవడం ఎలా

ద్వారకా తిరుమల భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ పట్టణం రోడ్డు, రైలు మరియు విమాన మార్గాల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి సులభంగా చేరుకోవచ్చు.


విమాన మార్గం: ద్వారకా తిరుమలకు సమీప విమానాశ్రయం1 రాజమండ్రి విమానాశ్రయం, ఇది పట్టణానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. విమానాశ్రయం నుండి, ద్వారకా తిరుమల చేరుకోవడానికి టాక్సీ లేదా బస్సులో అద్దెకు తీసుకోవచ్చు.2 గన్నవరం విమానాశ్రయం నుండి టాక్సీ లేదా క్యాబ్ సేవల ద్వారా ద్వారకా తిరుమల చేరుకుంటారు


రైలు ద్వారా: ద్వారకా తిరుమలకు సమీప రైల్వే స్టేషన్ భీమడోలు రైల్వే స్టేషన్, ఇది పట్టణానికి 15 కి.మీ దూరంలో ఉంది. అయితే, ఈ రైల్వే స్టేషన్ చిన్నది మరియు పరిమిత రైలు కనెక్టివిటీని కలిగి ఉంది. ద్వారకా తిరుమల నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏలూరు రైల్వే స్టేషన్ సమీప ప్రధాన రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ నుండి, పట్టణానికి చేరుకోవడానికి టాక్సీ లేదా బస్సులో అద్దెకు తీసుకోవచ్చు.


రోడ్డు మార్గం: ద్వారకా తిరుమల ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు మరియు పొరుగు రాష్ట్రాలకు రోడ్డు మార్గంలో బాగా అనుసంధానించబడి ఉంది. ఈ పట్టణం ఏలూరు నగరానికి 28 కి.మీ దూరంలో ఉంది, ఇది విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ మరియు చెన్నై వంటి ప్రధాన నగరాలకు రోడ్డు మార్గం ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. ద్వారకా తిరుమల చేరుకోవడానికి ప్రధాన నగరాల నుండి బస్సులో కూడా చేరుకోవచ్చు.


మొత్తంమీద, ద్వారకా తిరుమల సులభంగా చేరుకోగల పుణ్యక్షేత్రం, దీనిని వివిధ రవాణా మార్గాల ద్వారా చేరుకోవచ్చు.



Post a Comment

0 Comments